సక్సెస్ తెచ్చిన సంతోషం .. పారిస్ కి ఫ్యామిలీతో మహేశ్

  • 'భరత్'తో లభించిన హిట్  
  • ఫుల్ ఖుషీ అవుతోన్న మహేశ్
  • త్వరలోనే వంశీ పైడిపల్లితో సెట్స్ పైకి
కొంతకాలంగా మహేశ్ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ సినిమాకి ముందు చేసిన రెండు సినిమాలు భారీ పరాజయాలుగా నిలవడంతో ఆయన ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. అందువల్లనే ఎప్పుడూ లేనంత టెన్షన్ ను ఈ సారి అనుభవించానని మహేశ్ బాబు స్వయంగా చెప్పాడు.

ఈ సినిమా అంచనాలకి మించి వసూళ్లను సాధిస్తూ ఉండటంతో .. అభిమానులను కూడా సంతృప్తి పరిచినందుకు మహేశ్ ఫుల్ ఖుషీ అయ్యాడు. అందువల్లనే ఆయన ఫ్యామిలీతో కలిసి సరదాగా గడపడం కోసం పారిస్ వెళ్లాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ నమ్రత శిరోద్కర్ ఒక ఫొటోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అక్కడి నుంచి తిరిగొచ్చిన తరువాత, వంశీ పైడిపల్లితో కలిసి మహేశ్ సెట్స్ పైకి వెళ్లనున్నాడు.
Go Back to Shorts
Mahesh Babu
namratha

More Telugu News